సందేహాలు పలు రకాలు.
కొన్ని ధర్మ సందేహాలు ( అంటే ఎమిటో నాకు ఇప్పటికీ తెలీదు - అది కూడ ఒక సందేహం నాకు )
కొన్ని వెధవ సందేహాలు - అర్థం పర్థం ఉండదు, ఏదో ఊరికినే వచ్చాయి కద అని అత్యుత్సాహంతో అడగటం.....
కొన్ని నివృత్తి చేయలేని సందేహాలు - వీటిలో కొన్ని సందేహాలా లేక సత్యాలా అనే విషయం తెలీదు.....
నాకు ఉన్న కొన్ని సందేహాలు మీ మీద వదులుతున్నా.. వాటి category నాకు తెలీదు,... సమాధానాలు తెలీదు .. మీరే సహాయం చేయాలి... :-) :-)
To Start with.........
కృష్ణుడు అర్జునుడికి ఎలాగ బావ అవుతాడు ?
నేను పురాణాలలో కొంచం వీక్, మొత్తం సినిమా పరిజ్ఞానమే. ఏమి అనుకోవద్దు. విషయానికి వస్తే, సుభద్ర పెళ్ళికి ముందే వారిద్దరూ(కృష్ణుడు -అర్జునుడు) బావ బావ అని పిలుచుకుంటారు .......పోని ఏదైనా దూరపు చుట్టం అనుకుందాం అంటే కృష్ణుడు యాదవుడాయె ......మరి ఎలా - ఎలా బావ అవుతాడు అని నా సందేహం..
రెండో సందేహం ....మనసు అనేది ఎక్కడ ఉంటుంది??
కొందరు మనసు అనేది ఏమి ఉండదు అంటారు, కొందరు ఇక్కడ ఏమనిపిస్తే అది చేస్తాను అని గుండె దగ్గర చూపిస్తారు .... ఇంకొకరు నా మనసు కళ్ళతో చూడు అని నుదురు దగ్గర చూపిస్తారు ...(మనం అప్పుడప్పుడు crack గాడు అని సైగ చెసే చోటు :-) ).....
అసలు మనసు - హృదయం అనే వాటికి నిర్వచనం ఉందా .. మనసు అనేది ఉంటే అది ఎక్కడ ఉంటుంది .....
తర్వాతి సందేహం ...కోడి ముందా గుడ్డు ముందా
ఇది చాలా చాలా పాత ప్రశ్నే కాని సమాధానం లేని పాత ప్రశ్న.
నా అలోచన నాకు చెప్పే సమాధానం ఒకటి ఉంది - నాకు రైట్ అనిపిస్తుంది....
ఏంటంటె ఏది ముందు ఐనా తినేవాడు మాత్రం కోడి తినాలనిపించినపుడు కోడిని తింటాడు, గుడ్డు తినాలనిపిస్తే గుడ్డు తింటాదు - ఏది ముందో అదే తింటాను అని ఆలోచించడు కదా :-) ఇలా మీరు నన్ను అడిగితే నా దగ్గర సమాధానం లేదు, ఏదో నలుగురు అనుకునే ప్రశ్న కదా అని రాసాను.
నా సమాధానం మాత్రం - చాలా స్పష్టం - కోడి ముందు అని, ఎందుకంటే మట్టి నుండి సర్వ జీవరాశులు పుట్టించిన భగవంతుడు, వారి వారి జాతులను వృద్ధి చేసుకునే అవకాశం - ఆలోచన తర్వాత ఇచ్చాడు. సో, కోడి ముందు అని నా సమాధానం. కాదు అని మీరు నిరూపిస్తె నేనేమి అరగుండు కొట్టించుకొని ఊరేగను సుమండీ, :-)
ఇంక నా తర్వాతి సందేహానికి వస్తే -- ఇది మళ్ళీ మనసుకి / హృదయానికి సంబంధినది.
డిప్రెషన్ లో ఉన్నప్పుడు హర్ట్-బీట్ ఎందుకు నెమ్మది అవుతుంది..... బాధగా ఉన్నప్పుదు, శారీరకంగా కాదులెండి, మానసికంగానే, ఎందుకు గుండెల్లో కలత భావం కలుగుతుంది ... మనం సమస్యలగురించి ఆలోచించేది మనసుతో .. క్షమించాలి మెదడుతో..మరి గుండెకి ఎందుకు తడబాటు.....మానసిక అలసటకి కూడా హృదయం తన స్పందన మార్చుతుంది అందామన్నా నాకు మనసులో/మెదడులో ఎక్కడో అసంతృప్తి ... మీ సహాయం అందుకే అడుగుతున్నా....
ప్రకృతి చాలా విచిత్రమైంది - నేర్చుకుందాం అనుకుంటే సందేహాలు విసురుతోంది... ఆ రకంగా ఐనా మనం నెర్చుకుంటాం అని కాబోలు.....
అడగాల్సింది ఇంకా ఉంది చదవాల్సింది మిగిలే ఉంది .చూస్తునే ఉండండి టీవీ..... అలవాటుదోషం క్షమించాలి -- ఈ మధ్య న్యూస్ చానల్స్ చూస్తున్నలెండి
మరికొన్ని సందేహాలు తదుపరి లేఖలో...
మీ విశ్వనాథ్